Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎవరైనా గంజాయి పోగొట్టుకున్నారా? కంగారుపడకండి.. మాకు దొరికింది: పోలీసుల ఫన్నీ ట్వీట్

  • తనిఖీలను చూసి ట్రక్కును వదిలివెళ్లిన స్మగ్లర్లు
  • 50 కార్టన్లలో ప్యాక్ చేసిన గంజాయి
  • వైరల్ అయిన అసోం పోలీసుల ట్వీట్
"ఎవరిదైనా భారీ మొత్తంలో (590 కిలోలు) గంజాయి పోయిందా? గత రాత్రి చాగోలియా చెక్ పాయింట్ వద్ద ట్రక్కు గంజాయిని పోగొట్టుకున్నారా? ఆందోళన చెందకండి. మేము దాన్ని కనుగొన్నాం. పోగొట్టుకున్నవారు దుబ్రి పోలీస్ స్టేషన్ సంప్రదించండి. వారు మీకు తప్పనిసరిగా సాయం చేస్తారు" అంటూ అసోం పోలీసులు చేసిన ఫన్నీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, పోలీసుల తనిఖీలను చూసిన కొందరు గంజాయి స్మగ్లర్లు ట్రక్కును వదిలేసి పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ ట్రక్కులో చూడగా, గంజాయితో నిండిన 50 కార్టన్లు కనిపించాయి. వాటిని ఫొటో తీసిన పోలీసులు, దాన్ని కూడా తమ ట్వీట్ లో జతపరిచారు.
Assom
Police
Ganja
Tweet

More Telugu News