Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!: విజయసాయిరెడ్డి
- సాయిరెడ్డిని పార్లమెంటరీ పక్షనేతగా నియమించిన జగన్
- లోక్ సభ పక్షనేతగా మిధున్ రెడ్డి నియామకం
- ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి
వైసీపీ పార్లమెంటరీ పక్ష నేతగా తనను ఎంపిక చేసినందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘పార్లమెంటరీ పార్టీ నేతగా నన్ను నియమించినందుకు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పార్టీ లోక్‌సభ పక్ష నేతగా నియమితులైన శ్రీ పి.మిధున్ రెడ్డి, చీఫ్ విప్‌గా నియమితులైన శ్రీ మార్గని భరత్ రామ్‌కు నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.