Andhra Pradesh: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో అందరి కుటుంబాలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

మరోవైపు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ..‘సత్ప్రవర్తన, నియమనిష్టలతో కూడిన జీవనవిధానానికి మార్గం చూపిన ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్ర మాసం రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్షలు ముగించుకుని ఈరోజు పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరులకు #EidMubarak’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Jagan
Chief Minister
ramzan
Twitter
wishes

More Telugu News