Temples: జగన్ కీలక నిర్ణయం... టీటీడీ సహా అన్ని దేవాలయాల పాలకమండళ్ల రద్దుకు ఆర్డినెన్స్!

  • ప్రభుత్వం మారినా రాజీనామా చేయని పాలకమండళ్లు
  • 10న కేబినెట్ మీటింగ్ లో ఆర్డినెన్స్
  • సిద్ధం చేయాలని అధికారులకు జగన్ ఆదేశం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్డినెన్స్ తేవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 10వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్ పెట్టేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆయన ఆదేశించారని సమాచారం. ప్రభుత్వం మారినా, గత ప్రభుత్వం నియమించిన పాలకమండళ్లు రాజీనామా చేయకపోవడంతో ఆగ్రహంతో ఉన్న జగన్, ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం వంటి ఎన్నో దేవాలయాలకు పాలకమండళ్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్ వస్తే, అన్ని పాలకమండళ్లూ రద్దవుతాయి. 
Temples
Jagan
TTD
Ordinence

More Telugu News