Jagan: నేటి సమీక్షలను కేన్సిల్ చేసిన జగన్!

  • నేడు రంజాన్ పర్వదినం
  • వ్యవసాయ శాఖపై సమీక్ష రద్దు
  • వరుస భేటీలకు కాస్తంత విరామం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి నేటి తన సమీక్షలను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి వ్యవసాయ శాఖపై అధికారులతో నేడు సమీక్ష జరగాల్సి ఉంది. రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులు, ఈ సీజన్ లో రైతులకు నీటి లభ్యత, వివిధ ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీరు తదితరాలపై అధికారులను వివరాలు అడగాలని జగన్ భావించారు. అయితే, నిన్న నెలవంక కనిపించడం, నేడు రంజాన్ పర్వదినం కావడంతో ఈ సమీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే జగన్ ప్రభుత్వ అధికారులతో వరుస భేటీలు, సమీక్షలు జరుపుతూ రాష్ట్ర పరిస్థితిని అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే.
Jagan
Review
Agriculture
Ramjan

More Telugu News