Anoosha: ఎంసీఏ విద్యార్థిని... ఎంపీటీసీగా గెలుపు!

  • తిమ్మాపూర్ శ్రీ చైతన్యలో చదువుతున్న పులి అనూష
  • నాలుగు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి
  • మరోసారి పోటీ పడి ఎంపీటీసీగా గెలిచిన అనూష
పులి అనూష... మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం కుమార్తె. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంసీఏ చదువుతోంది. గ్రామాభ్యుదయం, అభివృద్ధి పనులపై ఆసక్తిని కనబరిచే ఆమె, గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ, ఈసారి మాత్రం ప్రజలు ఆమె వెంటే నిలిచారు.

మహిళలకు రిజర్వ్ అయిన సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థినిగా బరిలోకి దిగి గెలుపొందారు. టీఆర్ఎస్ తరఫున పడాల శ్రీజ పోటీ చేయగా, ఆమెకన్నా 72 ఓట్లు అనూష అదనంగా పొందారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఎంపీటీసీగా, అందునా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవడంపై పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. తమ కాలేజీలో చదువుతున్న అమ్మాయి ఎన్నికల్లో గెలవడంపై కళాశాల విద్యార్థులతో పాటు, యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. 
Anoosha
MPTC
Sri Chaitanya

More Telugu News