Pawan Kalyan: రంజాన్ ఉపవాస దీక్ష విశిష్టత వివరించిన పవన్ కల్యాణ్

  • స్నేహం, శాంతికి ప్రతిరూపం రంజాన్
  • ఇఫ్తార్ మతసామరస్యానికి ప్రతీక
  • ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.  తన తరఫున, జనసేన పార్టీ కార్యకర్తల తరఫున రంజాన్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ రంజాన్ ఉపవాస దీక్షల విశిష్టతను వివరించారు. పవిత్ర రంజాన్ మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో ప్రత్యేకత ఉందని, మానసిక, ఆధ్యాత్మికపరమైన అభివృద్ధికి, జీవనసాఫల్యానికి ఉపయోగపడే అంశాల సమాహారమే రంజాన్ అని పేర్కొన్నారు. అంతేగాకుండా, మనుషుల మధ్య స్నేహసంబంధాలకు, శాంతికి ప్రతిరూపమే రంజాన్ అని వివరించారు. ఇఫ్తార్ విందులతో మతసామరస్యం సాధ్యమేనని, అలాంటి రంజాన్ పవిత్రమాసం స్ఫూర్తి ఎల్లప్పుడూ కొనసాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
Pawan Kalyan
Andhra Pradesh
Telangana

More Telugu News