Jagan: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో సీఎం జగన్ భేటీ

  • వైజాగ్ నుంచి తిరిగొచ్చిన ఏపీ సీఎం
  • గృహనిర్మాణ శాఖ సమీక్ష రద్దు
  • జ్యుడిషియల్ కమిషన్ పై సీజేతో చర్చించే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్యాహ్నం వైజాగ్ పర్యటన ముగించుకుని విజయవాడ తిరిగొచ్చారు. వాస్తవానికి ఈ మధ్నాహ్నం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించాల్సి ఉన్నా, తన రాక ఆలస్యం కావడంతో సమీక్షను రద్దు చేశారు. అనంతరం ఆయన రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ తో భేటీ అయ్యారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ఏపీ సీజేను కలవడం ఇదే ప్రథమం. కాగా,  పలు ప్రాజక్టుల కాంట్రాక్టుల విషయంలో పారదర్శకత కోసం జ్యుడిషియల్ కమిషన్ వేయాలని సీఎం జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమిషన్ కోసం హైకోర్టు న్యాయమూర్తి ఒకరిని కేటాయించాలని కోరేందుకే జగన్ ఇవాళ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిసినట్టు తెలుస్తోంది.
Jagan
Andhra Pradesh

More Telugu News