Rajasthan: అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో 'అశ్లీల' బీభత్సం!

  • రాజస్థాన్ లో ఘటన
  • వీడియో కాన్ఫరెన్స్ నిలిపివేత
  • విచారణకు ఆదేశించిన కార్యదర్శి
రాజస్థాన్ లో దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా, మధ్యలో అశ్లీల వీడియో ప్రత్యక్షమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. సివిల్ సప్లయిస్ శాఖ కార్యదర్శి ముగ్ధా సింగ్ ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా, ఒక్కసారి అశ్లీల వీడియో తెరపై ప్రసారం అయింది. ఆ సమయంలో 33 జిల్లాలకు చెందిన అధికారులు కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

సదరు అశ్లీల క్లిప్పింగ్ చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. పౌరసరఫరాల శాఖ కార్యదర్శి ముగ్ధా సింగ్ నివ్వెరపోయారు. వెంటనే తేరుకున్న ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిలిపివేసి ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ తప్పిదం ఎలా జరిగిందో తెలుసుకోవాలని, దీనికి కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Rajasthan

More Telugu News