Andhra Pradesh: ఏపీ కొత్త అడ్వొకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ నియామకం

  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్
  • ఇప్పటికే కీలక పోస్టుల్లో మార్పులు
  • ఉమ్మడి హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్
ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక పోస్టుల్లో నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే డీజీపీ, తదితరుల నియామకం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రానికి కొత్త అడ్వొకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.

కాగా, శ్రీరామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గత ప్రభుత్వానికి చెందిన అనేక కేసులను ఆయన సమర్థంగా వాదించారు. ఆయనకు సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న కారణంగానే జగన్ ఏరికోరి అడ్వొకేట్ జనరల్ గా తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

Andhra Pradesh

More Telugu News