saidharam tej: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమాకి ఆసక్తికరమైన టైటిల్

  • మారుతి దర్శకత్వంలో తేజు 
  • టైటిల్ గా పరిశీలనలో 'భోగి'
  • త్వరలో సెట్స్ పైకి    
'చిత్రలహరి' సినిమాతో మళ్లీ సక్సెస్ గాడిలో పడిన సాయిధరమ్ తేజ్, తన తదుపరి సినిమా కోసం రంగంలోకి దిగుతున్నాడు. సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం మారుతి దర్శకత్వంలో వుంది. గీతా ఆర్ట్స్ వారు .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకి 'భోగి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టైటిల్ ను బట్టి ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా మాళవిక శర్మను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 
saidharam tej
malavika

More Telugu News