jd chakravarthi: మహేశ్వరి కోసం నేను, కృష్ణవంశీ గొడవపడ్డామనే వార్తలో నిజం లేకపోలేదు!: జేడీ చక్రవర్తి

  • అప్పట్లో 'గులాబీ' పెద్ద హిట్ 
  • మహేశ్వరితో కెమిస్ట్రీ బాగుండేది
  •  అందువలన అలా ప్రచారం జరిగింది  
తెలుగు తెరపై హీరోగా జేడీ చక్రవర్తి తనదైన ముద్ర వేశారు. ఆయన కీలకమైన పాత్రను పోషించిన 'హిప్పీ' ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఒకప్పుడు ఆయనకీ .. మహేశ్వరికి మధ్య ఎఫైర్ వున్నట్టుగా వచ్చిన వార్తలను గురించిన ప్రస్తావన తాజా ఇంటర్వ్యూలో వచ్చింది.

అందుకు ఆయన స్పందిస్తూ .. 'గులాబీ' సినిమాలో నాకు .. మహేశ్వరికి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దాంతో మా ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ లేదు. మహేశ్వరి కోసం నేను .. కృష్ణవంశీ గొడవపడ్డామనే వార్తలో నిజం లేకపోలేదు. కానీ ఎఫైర్ల వరకూ ఎప్పుడూ వెళ్లలేదు" అని చెప్పుకొచ్చారు. 
jd chakravarthi

More Telugu News