Jagan: స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్... ఫోటోలు ఇవిగో!

  • సీఎం అయ్యాక తొలిసారి వైజాగ్ వెళ్లిన జగన్
  • సంప్రదాయ దుస్తుల్లో శారదాపీఠం సందర్శన
  • ఆశ్రమంలో ఏపీ సీఎంకు ఘనస్వాగతం
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా వైజాగ్ లో అడుగుపెట్టారు. విశాఖలోని శ్రీ శారదపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో స్వామివారి వద్దకు విచ్చేసిన జగన్ కు ఆశ్రమంలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సీఎం జగన్ తో రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం పవిత్ర కుంకుమను జగన్ నుదుట అద్దారు. ఈ సందర్భంగా జగన్, స్వరూపానందేంద్ర మధ్య కాసేపు చర్చ జరిగింది. స్వామివారు పీఠంపై ఆసీనులు కాగా, జగన్ సాధారణ భక్తుడిలా నేలపై కూర్చున్నారు.
Jagan

More Telugu News