P Suseela: జగన్ కు అభినందనలు తెలిపిన గాయని సుశీల!

  • ప్రజారంజక పాలన సాగించాలి
  • ప్రజల దీవెనలతో సీఎం అయిన జగన్
  • వైఎస్ పాలన గుర్తు చేయాలన్న సుశీల
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలానే జగన్ కూడా ప్రజారంజక పాలన సాగించాలని ప్రముఖ సినీ గాయని పి.సుశీల ఆకాంక్షించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీకి, పార్టీ అధినేత జగన్ కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల దీవెనలతో ఆయన సీఎం అయ్యారని, ఆయనకు తన శుభాశీస్సులని అన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఎందరో కళాకారులను ఆయన ఆదుకున్నారని, ప్రోత్సాహమిచ్చారని గుర్తు చేసుకున్న సుశీల, జగన్ కూడా అదే విధమైన పాలన సాగించాలని అభిలషించారు.
P Suseela
Jagan
Greetings
YSR

More Telugu News