Jagan: విశాఖకు చేరుకున్న జగన్... ఘనస్వాగతం!
- 12 గంటల సమయంలో విశాఖకు జగన్
- ప్లెక్సీలతో నిండిపోయిన రహదారులు
- జగన్ కు మంగళ వాయిద్యాలతో స్వాగతం
విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని సందర్శించుకునేందుకు ఈ ఉదయం 12 గంటల సమయంలో నగరానికి వచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు, పార్టీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి శారదాపీఠానికి దారితీసే మార్గాన్ని అందంగా అలంకరించారు. అడుగడుగునా తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుపు, నీలం రంగు బుడగలను పెద్దఎత్తున కట్టారు.
12.30 గంటల సమయంలో శారదా పీఠానికి చేరుకున్న జగన్ కు పీఠం నిర్వాహకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆపై స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిసేందుకు లోపలికి వెళ్లారు. మరికాసేపట్లో జగన్ రాజశ్యామల అమ్మవారికి పూజలు చేయనున్నారు. జగన్ తొలి విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.