Ramcharan: రామ్ చరణ్ లేటెస్ట్ స్టిల్... 'కొదమసింహం' ట్యాగ్ లైన్ పెట్టడంతో వైరల్!

  • 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కు కాస్తంత విరామం
  • ఉపాసనతో కలిసి చెర్రీ ఎంజాయ్
  • తదుపరి చిత్రం పేరు 'కొదమసింహం' అని చర్చ
తనతో పాటు ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కు కాస్తంత విరామం దొరకడంతో తన భార్య ఉపాసనతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ తాజా చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే, ఈ ఫోటోలకు 'కొదమసింహం' అన్న ట్యాగ్ లైన్ తగిలించడమే. చిరంజీవి కెరీర్ లో 'కొదమసింహం' ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా రామ్ చరణ్ ఫోటోలకు ఆ ట్యాగ్ లైన్ జోడించడంతో, చరణ్ తదుపరి చిత్రం పేరు అదేనా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. 
Ramcharan
NTR
Rajamouli
RRR
Kodamasimham

More Telugu News