Chandra dandu: పదవికి రాజీనామా చేసిన ‘చంద్రదండు’ అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు

  • 2004లో ఏర్పాటైన చంద్రదండు
  • 2014లో రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌‌గా ప్రకాశ్ నాయుడు నియామకం
  • పార్టీ ఓటమితో పదవికి రాజీనామా
టీడీపీ నేత, చంద్రదండు అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ శాఖ కమిషనర్‌కు పంపారు. ప్రకాశ్ నాయుడు ఆధ్వర్యంలో 2004లో చంద్రదండు ఏర్పాటైంది. వేలాదిమంది కార్యకర్తలతో ఏర్పాటైన ఈ విభాగం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రదండు అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను  రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌‌గా నియమించింది. అయితే, తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమితో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
Chandra dandu
Telugudesam
prakash naidu
Chandrababu
Andhra Pradesh

More Telugu News