boat: సీలేరు నదిలో మునిగిపోయిన పడవ.. ముగ్గురి మృతి

  • మృతులు ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాకు చెందినవారు
  • డొంకరాయలో సరుకులు కొనుక్కుని వెళ్తుండగా ప్రమాదం
  • మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి
సీలేరు నదిలో నాటు పడవ మునిగిపోయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం అలముకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే, ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా గుర్రాలూరు గ్రామానికి చెందిన ఏడుగురు తూర్పుగోదావరి జిల్లా బొడ్డుమామిడి పక్కన గల బెంగాలీ క్యాంప్ కు నాటు పడవలో వచ్చారు. అక్కడి నుంచి డొంకరాయకు బస్సులో చేరుకున్నారు.

 కావాల్సిన సరుకులు కొనుక్కుని అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. పడవలో స్వగ్రామానికి వెళ్తుండగా, బలమైన గాలులు వీయడంతో పడవ బోల్తా కొట్టింది. ఇదే సమయంలో మరో నాటు పడవపై అటుగా వెళ్తున్న పశ్చిమబెంగాల్ కు చెందిన చేపల వ్యాపారి కార్తీక్ ప్రమాదాన్ని గుర్తించాడు. అక్కడకు చేరుకుని కొందరిని రక్షించాడు. ముగ్గురిని మాత్రం కాపాడలేకపోయాడు.
boat
accident
sileru

More Telugu News