Prakasam District: ప్రకాశం జిల్లాలో వడగండ్ల వాన

  • రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు
  • ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం
  • కొన్నిప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
రాష్ట్రంలో ఇవాళ కూడా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని మార్టూరులో వడగండ్ల వర్షం కురిసింది. చీరాల, చినగంజాం ప్రాంతంలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి.  

ఈదురుగాలుల కారణంగా చీరాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు గుంటూరు జిల్లాలో తాడికొండ, మంగళగిరి, అమరావతి, గుంటూరు పట్టణంలో వర్షాలు కురిశాయి. దాంతో జిల్లా ఒక్కసారిగా చల్లబడింది. విజయవాడలో కూడా చిరుజల్లులు కురియడంతో ప్రజలు రిలీఫ్ గా ఫీలయ్యారు.
Prakasam District

More Telugu News