ఓ పద్ధతిగల అమ్మాయి సౌందర్య: సుబ్బరాయ శర్మ
- నా తొలి సినిమా 'మయూరి'
- సింగీతంతో చేయడం అదృష్టం
- సౌందర్య పద్ధతిగల అమ్మాయి
"నా తొలి సినిమా 'మయూరి' .. ఆ సినిమాలో నా పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తొలి సినిమా చేసే అవకాశం రావడం విశేషం. ఈ సినిమా తరువాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా సౌందర్యతో కలిసి అరడజనుకి పైగా సినిమాల్లో నటించాను. సౌందర్య ఎంతో మంచి మనిషి. సెట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి తన పాత్రను గురించే ఆలోచించేది. ఆర్టిస్టులందరినీ ఎంతో గౌరవించేది. తన పని తాను చేసుకుపోయే పద్ధతిగల అమ్మాయి సౌందర్య" అని చెప్పుకొచ్చారు.