Telangana: తెలంగాణ స్థానిక ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం... తొలి లీడ్స్ కాంగ్రెస్ కు అనుకూలం!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాలకు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగగా, 11 గంటలలోపే తుది ఫలితాన్ని వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

వరంగల్‌ లో టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి వెంకట్రామిరెడ్డి పోటీ పడుతుండగా, నల్గొండలో టీఆర్ఎస్ తరఫున చిన్నపరెడ్డి, కాంగ్రెస్‌ తరఫున లక్ష్మి బరిలో నిలిచారు. ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే, టీఆర్ఎస్ నుంచి మహేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి రౌండ్లలో మూడు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Telangana
MLC
TRS
Congress

More Telugu News