Cricket: విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న దక్షిణాఫ్రికా

  • 39.1 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసిన సఫారీలు
  • రాణించిన టాపార్డర్
  • ఆసక్తికరంగా సాగుతున్న మ్యాచ్
బంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన దక్షిణాఫ్రికా, కనీసం రెండో మ్యాచ్ లోనైనా నెగ్గి బోణీ కొట్టాలని భావిస్తోంది. లండన్ లో ఇవాళ జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలుత 6 వికెట్లకు 330 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టుకు తొలి వికెట్ కు 49 పరుగుల శుభారంభం లభించింది. అనంతరం, మర్ క్రమ్ 45, డుప్లెసిస్ 62, మిల్లర్ 38, డుస్సెన్ 41 పరుగులు చేశారు. ప్రస్తుతం 39.1 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 10.5 ఓవర్లలో 103 పరుగులు చేయాలి.
Cricket

More Telugu News