Visakha: ఆటో ప్రమాదంపై కలెక్టర్‌కు ఫోన్ చేసిన సీఎం జగన్

  • ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఐదుగురు మృతి
  • మెరుగైన వైద్యం అందేలా చూడాలన్న జగన్
  • మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేయాలని సూచన
విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం చెరువూరులో ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కోరుకొండ సంతకు వెళ్లిన 11 మంది ఆటోలో తిరిగి వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఘటనపై కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేయాలని సూచించారు.
Visakha
Jagan
Collector
Auto
Electrical Pole
Exgratia

More Telugu News