Cricket: సఫారీలపై గర్జించిన బంగ్లా పులులు... 50 ఓవర్లలో పరుగుల వర్షం!

  • బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 330
  • రాణించిన బ్యాట్స్ మెన్
  • షకీబ్, ముష్ఫికర్, మహ్మదుల్లా విజృంభణ
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇవాళ పరుగుల వాన కురిసింది.  దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ (42) నుంచి షకీబల్ హసన్ (75), ముష్ఫికర్ రహీం (78), చివర్లో మహ్మదుల్లా (46 నాటౌట్) వరకు అందరూ బాధ్యతగా ఆడడంతో బంగ్లాకు భారీస్కోరు సాధ్యమైంది. ఆ జట్టుకు ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. 35 ఓవర్ నుంచి 45 ఓవర్ వరకు పది ఓవర్లపాటు పరుగులు మందగించినా చివర్లో మహ్మదుల్లా బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లా 300 మార్కు దాటడమే కాదు, సఫారీల ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్నుంచింది.
Cricket

More Telugu News