Army Soldiers: ఇద్దరు జవాన్లపై విరుచుకుపడిన రెస్టారెంట్ సిబ్బంది.. రక్తమోడేలా చితకబాదారు!

  • భోజనం చేసేందుకు రెస్టారెంట్‌కు వెళ్లిన జవానులు
  • చిన్నపాటి ఘర్షణ.. సిబ్బంది జోక్యంతో పెద్ద గొడవ
  • రోడ్డుపైకి ఈడ్చి విచక్షణా రహితంగా దాడి
ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లపై విరుచుకుపడిన రెస్టారెంట్ సిబ్బంది రక్తమోడుతున్నా విడిచిపెట్టకుండా విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. బాఘ్‌పట్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇద్దరు జవానులు భోజనం చేసేందుకు వెళ్లగా, అక్కడ ఓ వ్యక్తితో చిన్నపాటి ఘర్షణ జరిగింది.

రెస్టారెంట్ సిబ్బంది జోక్యంతో గొడవ పెద్దదైంది. దీంతో జవాన్లను రోడ్డుపైకి ఈడ్చి దూషిస్తూ కర్రలతో విచక్షణా రహితంగా చావబాదారు. ఇక జవాను తిరగబడినప్పటికీ వారి బలం ముందు నిలవలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని 8 మందిని అరెస్ట్ చేశారు.


Army Soldiers
Uttar Pradesh
Restuarant
ANI
Police

More Telugu News