Andhra Pradesh: మంత్రివర్గం ఎంపికపై సీఎం జగన్ కసరత్తు.. ఈ నెల 7న వైసీఎల్పీ భేటీ!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గం ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 7న జగన్ నేతృత్వంలో వైసీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి 151 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పార్లమెంటు సభ్యులు హాజరుకానున్నారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో మంత్రివర్గ కూర్పుపై జగన్ నేతలతో చర్చిస్తారని సమాచారం. అనంతరం మరుసటి రోజు జగన్ తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Jagan
yslp
Chief Minister

More Telugu News