Guntur District: గుంటూరులో ఈ నెల 3న ఏపీ ప్రభుత్వ ఇఫ్తార్ విందు

  • ముఖ్య అతిథిగా సీఎం జగన్
  • వేదికలో మార్పు
  • బీఆర్ స్టేడియం నుంచి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కు తరలింపు
మరో నాలుగు రోజుల్లో రంజాన్ రానున్న తరుణంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇవ్వగా, తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఏపీలో జూన్ 3న ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ విందు గుంటూరులో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా  హాజరవుతున్నారు. ఆయనతో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఇఫ్తార్ లో పాల్గొంటారు. కాగా, గుంటూరులో వర్షం కురవడంతో ఇఫ్తార్ వేదికగా తొలుత నిర్ణయించిన బీఆర్ స్టేడియంను రద్దు చేసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కు మార్చారు.
Guntur District
Andhra Pradesh
Jagan

More Telugu News