Chandrababu: అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు: పార్టీ నేతలతో చంద్రబాబు

  • కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల్లో ఉండాలి
  • టీడీపీకి ఆటుపోట్లు కొత్తేమీ కాదు
  • సమన్వయంతో ముందుకు సాగాలి
అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదని, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల్లో ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలకు సూచించారు. నేడు తెలంగాణకు చెందిన ఆ పార్టీ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు విషయాలపై చర్చించారు. ఏపీలో టీడీపీ ఓటమికి గల కారణాలతో పాటు, తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. టీడీపీకి ఆటుపోట్లు కొత్తేమీ కాదన్న చంద్రబాబు, సమన్వయంతో ముందుకు సాగాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.
Chandrababu
Telugudesam
Cadre
Telangana
Andhra Pradesh

More Telugu News