DA: ఉద్యోగులకు డీఏను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

  • 3.144 శాతం డీఏను పెంచుతూ నిర్ణయం
  • 30.392 శాతానికి పెరిగిన డీఏ
  • 2018 జులై 1 నుంచి అమలు
ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల కరవు భత్యాన్ని(డీఏ) పెంచుతూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 27.248 శాతం ఉన్న డీఏను 30.392 శాతానికి పెంచింది. అంటే 3.144 శాతం డీఏను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ 2018 జులై 1నుంచి అమలులోకి రానుంది. ఈ నెల నుంచి వేతనంతోపాటు పెరిగిన డీఏ కూడా అందనుంది. బకాయిలను మాత్రం సాధారణ భవిష్య నిధి ఖాతాకు జమ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
DA
Telangana
State Government
Salary
PF

More Telugu News