jagan: ఈ పని చేస్తే జగన్ ను అభినందిస్తా: టీడీపీ నేత చెంగల్రాయుడు

  • రాజంపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలి
  • పెన్షన్లను విడతల వారీగా పెంచుతామని జగన్ చెప్పలేదు
  • తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి
కడప జిల్లాలోని రాజంపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి జగన్ ను అభినందిస్తామని టీడీపీ నేత చెంగల్రాయుడు అన్నారు. విడతలవారీగా మద్యనిషేధం చేస్తామని జగన్ చెప్పిన మాట నిజమేనని... కానీ, విడతల వారీగా పెన్షన్లను పెంచుతామని ఎప్పుడూ చెప్పలేదని ఎద్దేవా చేశారు. వీరబల్లె, సుండుపల్లె మండలాలకు తాగునీటిని అందించడం కోసం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి చంద్రబాబు పనులను ప్రారంభించారని... అదే విధంగా రాష్ట్రంలో తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టులను జగన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
jagan
changalrayudu

More Telugu News