Chandrababu: చంద్రబాబు అవినీతిపై జగన్ ప్రభుత్వం ఆధారాలు ఇస్తే సీబీఐతో విచారణ జరిపిస్తాం: ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్

  • చంద్రబాబు అవినీతిపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
  • లూటీ చేసిన చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిందే
  • జగన్ కు సహకరిస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతిపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ డిమాండ్ చేశారు. చంద్రబాబు అవినీతికి సంబంధించిన ఆధారాలను ప్రభుత్వం ఇస్తే సీబీఐతో విచారణ జరిపిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. ఏడాది పాటు జగన్ పరిపాలనను పరిశీలిస్తామని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కోడలని... ఆమె రూపంలో లక్ష్మీదేవి ఏపీలో ఉన్నట్టేనని అన్నారు. తెలుగుదేశం, జనసేనల నుంచి వచ్చే నాయకుల కోసం బీజేపీ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు.
Chandrababu
jail
corruption
jagan
sunil deodar

More Telugu News