Andhra Pradesh: ఏపీలో మోదీ టూర్ ఖరారు.. ప్రధానితో ప్రత్యేకంగా భేటీ కానున్న సీఎం జగన్!

  • ఈ నెల 9న తిరుమలకు ప్రధాని
  • కొండపై ప్రధానితో జగన్ భేటీ
  • ఏపీ ఆర్థిక ఇబ్బందులపై చర్చించే ఛాన్స్
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 9న మాల్దీవులు, శ్రీలంక పర్యటన నుంచి భారత్ కు చేరుకోనున్న మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు ప్రధాని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు మోదీ తిరుమల టూర్ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన నిధులు, లోటు బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులను ముఖ్యమంత్రి జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళతారని చెప్పాయి.
Andhra Pradesh
Tirumala
Narendra Modi
Jagan
YSRCP

More Telugu News