Andhra Pradesh: ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఆనంద్ సూర్య రాజీనామా!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవికి టీడీపీ నేత ఆనంద్ సూర్య ఈరోజు రాజీనామా సమర్పించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా 23 నెలల పాటు తాను సేవలు అందించానని ఆనంద్ సూర్య తెలిపారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆనంద్ సూర్య మాట్లాడారు.

తన పదవీకాలంలో ఏపీలోని బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేశానని ఆయన తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చాలని కోరారు. భవిష్యత్ లో ఏపీలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
brahmin corporation
anand surya
resign
Jagan
Chief Minister

More Telugu News