ysrcp: ఏపీ ఖజానాలో రూ. 100 కోట్లే మిగిల్చారు: వైసీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి

  • ఐదేళ్లలో ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు
  • సమస్యలను జగన్ అధిగమిస్తారు
  • పోలవరం ప్రాజెక్టుకు వైయస్ పేరు పెట్టాలి
గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఖజానాలో కేవలం రూ. 100 కోట్లను మాత్రమే మిగిల్చారని అన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయని... వాటన్నింటినీ ముఖ్యమంత్రి జగన్ అధిగమిస్తారని చెప్పారు. రాష్ట్రంలో అవినీతికి చోటు లేకుండా చేసేందుకు అవినీతిరహిత పాలనకు జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు పోలవరం ప్రాజెక్టుకు, వుడా సెంట్రల్ పార్కుకు వైయస్ఆర్ పేరు పెట్టాలని విన్నవించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ysrcp
koyya prasad reddy
jagan

More Telugu News