Hyderabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో...దుబాయ్‌ ప్రయాణికుడి నుంచి కేజీన్నర బంగారం స్వాధీనం

  • నిన్ననే కేజీన్నర స్వాధీనం చేసుకున్న అధికారులు
  • ఇటీవల తరచూ ప్రయాణికుల వద్ద లభిస్తున్న పసిడి
  • అధికారులనే ఆశ్చర్యపరుస్తున్న వరుస సంఘటనలు
హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు మరో కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో దాచిన బంగారం తనిఖీల్లో బయటపడింది. దీని విలువ 45 లక్షల రూపాయలు పైనే ఉంటుందని అంచనా.

ఇటీవల సంఘటనలను పరిశీలిస్తే హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం బంగారం స్మగ్లర్లకు అడ్డాగా మారిందా? అన్న అనుమానం కలుగుతోంది. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో ఇక్కడ తరచూ బంగారం పట్టుబడుతుండడం అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది. నిన్ననే ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్‌ అధికారులు కేజీన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మళ్లీ ఈరోజు కూడా అదే పరిమాణంలో బంగారం లభించడం గమనార్హం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడిని విచారిస్తున్నారు.
Hyderabad
samsabad airiport
goldseiged
one arrest

More Telugu News