Kadapa District: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి

  • పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్‌
  • వివిధ పత్రికల్లో పనిచేసిన నాగేశ్వరరెడ్డి
  • ప్రజాసంకల్ప యాత్రలో కీలకంగా వ్యవహరించిన నాగేశ్వరరెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. అలాగే, పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 నుంచి జగన్‌తోనే ఉంటున్న నాగేశ్వరరెడ్డి స్వస్థలం కడప. వివిధ పత్రికల్లో పనిచేసిన ఆయన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు.

విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిన సమయంలోనూ ఆయన పక్కనే ఉన్నారు. వివిధ వర్గాలకు చెందిన నేతలతో జగన్ సమావేశాలు నిర్వహించడంలో నాగేశ్వరరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఆయనను జగన్ తన పీఏగా నియమించుకున్నట్టు తెలుస్తోంది.
Kadapa District
Jagan
Andhra Pradesh
PA
nageswarareddy

More Telugu News