America: మళ్లీ రక్తమోడిన అమెరికా.. దుండగుడి కాల్పుల్లో 11 మంది మృతి

  • శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఘటన
  • నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి
  • మట్టుబెట్టిన పోలీసులు
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకి గర్జించింది. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియా రాష్ట్రంలోని బీచ్ నగరంలో జరిగిందీ ఘటన. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రభుత్వ భవన సముదాయంలోకి ప్రవేశించిన సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఆరుగురిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని హతమార్చారు. దుండగుడు అదే కార్యాలయంలో పనిచేసేవాడని పేర్కొన్న పోలీసులు.. కాల్పుల వెనకున్న కారణం తెలియాల్సి ఉందన్నారు.
America
Gun shooting
virginia
dead

More Telugu News