Kesineni Nani: జగన్ ను అభినందిస్తూ లేఖ రాసిన కేశినేని నాని!

  • ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించారంటూ ప్రశంస
  • ప్రధాని మోదీకి కూడా శుభాకాంక్షలు చెప్పిన నాని
  • ప్రజలు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటూ ఆకాంక్ష
విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ సీఎంగా పరిపాలన ఆరంభించిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో అద్వితీయమైన రీతిలో విజయం సాధించారంటూ కితాబిచ్చారు. అటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా కేశినేని నాని విషెస్ చెప్పారు. ప్రజలు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సేవ చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఓ టీడీపీ ఎంపీ జగన్ ను అభినందిస్తూ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
Kesineni Nani
Jagan
Narendra Modi

More Telugu News