Jagan: ముఖ్యమంత్రిగా తొలిసారి హైదరాబాద్ లో అడుగుపెడుతున్న జగన్

  • శనివారం సాయంత్రం హైదరాబాద్ పయనం
  • రేపు రాజ్ భవన్ లో ఇఫ్తార్ విందులో పాల్గొంటున్న ఏపీ సీఎం
  • జూన్ 3న గుంటూరులో ఇఫ్తార్ విందు
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మొదటిసారిగా హైదరాబాద్ లో అడుగుపెడుతున్నారు. ఆయన రేపు హైదరాబాద్ వెళుతున్నారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ఇస్తున్న ఇఫ్తార్ విందులో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది. ఇఫ్తార్ విందు కోసం రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 3న గుంటూరులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలోనూ జగన్ పాల్గొంటారు.
Jagan
Hyderabad

More Telugu News