Vijayasanthi: 'సరిలేరు నీకెవ్వరు' సినిమా అవకాశంపై స్పందించిన విజయశాంతి

  • సినిమాల పట్ల అంకితభావం ఉంది
  • ఈ అవకాశాన్ని బాధ్యతగా భావిస్తాను
  • చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నా
చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. సినిమాల నుంచి తప్పుకుని రాజకీయాలతో బిజీ అయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమయ్యారు. విజయశాంతి తాజాగా మహేశ్ బాబు కొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో కీలకపాత్ర చేస్తున్నారు.

దీనిపై విజయశాంతి మాట్లాడుతూ, చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ఇది భగవంతుడి సంకల్పం అయ్యుండాలి, లేకపోతే, ప్రజల అభిమాన బలమో అయ్యుండాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఓ బాధ్యతగా భావిస్తానని విజయశాంతి పేర్కొన్నారు. తనకు ఇప్పటికీ సినిమాల పట్ల అంకితభావం ఉందని, వృత్తి పట్ల గౌరవం ఉందని స్పష్టం చేశారు. మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ కు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన స్పందన వస్తోంది.
Vijayasanthi
Mahesh Babu

More Telugu News