Telangana: తెలంగాణలో ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాల వెల్లడి

  • ప్రకటించిన ఇంటర్ బోర్డు
  • ఆన్ లైన్ లో జవాబు పత్రాలు
  • వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
తెలంగాణలో ఇటీవల ఇంటర్ మార్కుల వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మెరిట్ విద్యార్థులు సైతం కొన్ని సబ్జెక్టుల్లో తప్పినట్టుగా ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 20 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన తెలంగాణ ప్రభుత్వం రీవెరిఫికేషన్ అవకాశం కల్పించింది. ఈ మేరకు నేడు ఇంటర్ విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు వెల్లడించారు. కాగా, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి జవాబు పత్రాలను ఆన్ లైన్ లో ఉంచినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. వాటిని ఇంటర్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Telangana
Inter Results
Reverification

More Telugu News