Sri Lakshmi: నేడు ఏపీ ముఖ్యమంత్రిని కలసిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి!

  • నేడు జగన్‌ను కలిసిన శ్రీలక్ష్మి
  • తనకు అవకాశమివ్వాలని కోరారు
  • కీలకమైన శాఖను అప్పగించనున్న జగన్
ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలు పాలై, అనంతరం నిర్దోషిగా బయటకు వచ్చిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్నారు. నేడు ఆమె ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి, ఏపీలో సేవలు అందించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారని సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, ఆమెకు కీలకమైన శాఖను అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
Sri Lakshmi
Jagan
Obulapuram
Andhra Pradesh
Telangana

More Telugu News