Chandrababu: చంద్రబాబుతో సమావేశమైన జేసీ, టీటీడీపీ నేతలు

  • హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు
  • ఆయన నివాసానికి వచ్చిన నేతలు
  • ఓటమికి గల కారణాలపై విశ్లేషణ
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలు భేటీ అయ్యారు. హెల్త్ చెకప్ కోసం చంద్రబాబు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. చెకప్ అనంతరం జూబ్లీహిల్స్ లో ఉన్న తన నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన టీడీపీ నేతలు దాదాపు అరగంట సేపు ఆయనతో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు, తాజా పరిణామాలపై వీరు చర్చించారు.

సమావేశానంతరం మీడియాతో రావుల మాట్లాడుతూ, ఎన్నికల ఓటమికి గల కారణాలను విశ్లేషించామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తామని... ప్రజాసమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు.
Chandrababu
jc
tTelugudesam

More Telugu News