Jagan: ఈ ప్రజాతీర్పు నాపై అపారమైన బాధ్యతను మోపింది: జగన్

  • దేవుడికి, ప్రజలకు కృతజ్ఞతలు
  • అందరి అంచనాలను అందుకుంటాను
  • దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పరిపాలన సాగిస్తా
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా సందేశం వెలువరించారు. తన అఖండ విజయానికి దేవుడు ఆశీస్సులు, ప్రజల మద్దతే కారణమని, అందుకే ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు తనపై అపారమైన బాధ్యతను మోపిందని జగన్ పేర్కొన్నారు. ప్రజల అంచనాలు అందుకునేలా తన పాలన ఉంటుందని స్పష్టం చేశారు. సుపరిపాలన అందించడం ద్వారా యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.
Jagan
Andhra Pradesh
YSRCP
YSJagan

More Telugu News