neeraja: అందుకే సినిమాలు చేయలేకపోయాను: నటి నీరజ

  • 'తులసీదళం' నా ఫస్టు సీరియల్
  • చాలా తక్కువ సీరియల్స్ చేశాను 
  • తొందరగా ఎవరితోనూ కలవలేను
బుల్లితెర ప్రేక్షకులకు నీరజను గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రల ద్వారా ఆమె ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను నటన వైపుకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి నేను 'తులసీదళం' సీరియల్ ద్వారా నటిగా నా కెరియర్ ను మొదలు పెట్టాను.

నాతో కెరియర్ ను ఆరంభించిన వాళ్లతో పోలిస్తే నేను చాలా తక్కువ సీరియల్స్ చేశాను. కొత్తదనం కలిగిన పాత్రలను మాత్రమే అంగీకరించడం అందుకు కారణం. ఇక నేను తొందరగా ఎవరితోనూ కలవలేను. అందరితో కలివిడిగా ఉంటూ కలుపుకుపోతూ వుంటేనే సినిమాల్లో అవకాశాలు వస్తుంటాయి. అలాంటి మనస్తత్వం కాకపోవడం వలన సినిమాల్లో చేయలేకపోయాను" అని చెప్పుకొచ్చారు. 
neeraja

More Telugu News