Vinod Varma: తూ.గో.జిలాలో డ్యామ్ లోకి దూసుకెళ్లిన కారు... స్థానిక వైసీపీ నేత దుర్మరణం!

  • యానాం నుంచి కోటిపల్లికి వస్తున్న వర్మ 
  • పాతకోట డ్యామ్ లోకి దూసుకెళ్లిన కారు
  • కేసును విచారిస్తున్న పోలీసులు
ఈ ఉదయం తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో వైసీపీ నేత వినోద్ వర్మ దుర్మరణం పాలయ్యారు. ఎదుర్లంక ప్రాంతానికి చెందిన వైసీపీ నేత వర్మ, యానాం నుంచి కోటిపల్లికి వెళుతున్న వేళ, కె.గంగవరం మండలం పాతకోట వద్ద ఉన్న డ్యామ్ లోకి ఆయన కారు దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నట్టు తెలుస్తోంది. డ్యామ్ నీటిలో కారు పూర్తిగా మునిగిపోగా, స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వినోద్ వర్మ మృతికి జిల్లా వైసీపీ నేతలు సంతాపాన్ని తెలిపారు.
Vinod Varma
Yanam
Dam
Road Accident
YSRCP

More Telugu News