karthi: ఒకే ఒక్క రాత్రిలో జరిగే కథగా 'ఖైదీ' .. టీజర్ రిలీజ్

  • కార్తీ నుంచి రానున్న 'ఖైదీ'
  • చీకటిలోనే జరిగే ఆసక్తికరమైన కథ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
మొదటి నుంచి కూడా కార్తీ వైవిధ్యభరితమైన కథాంశాలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అలా 'ఖాకీ' సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఆయన, త్వరలో 'ఖైదీ'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో 'ఖైదీ'గా డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించనున్నాడు. ఒక రాత్రివేళ జైలు నుంచి తప్పించుకున్న 'ఖైదీ' కోసం ఒక వైపున పోలీసులు .. మరో వైపున రౌడీ గ్యాంగ్ గాలిస్తూ ఉండటమనేది ఉత్కంఠభరితమైన మలుపులతో కొనసాగుతూ ఉంటుంది. అందువలన సినిమా అంతా చీకటిలోనే నడుస్తుంది. ఈ కారణంగానే ఈ సినిమాలో కథానాయికకి కూడా స్థానం లేకుండా పోయింది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ మాత్రం అంచనాలను పెంచేదిలానే వుంది.
karthi

More Telugu News