Jagan: జగన్ ప్రమాణ స్వీకారం... టొరంటోలో ప్రవాసాంధ్రుల సంబరాలు!

  • నిన్న వైఎస్ జగన్ ప్రమాణం
  • 'జై జగన్' అంటూ నినాదాలు
  • పాల్గొన్న మహిళలు, చిన్నారులు
ఏపీ సీఎంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వేళ, కెనడా రాజధాని టొరంటోలో ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. వైసీపీ జెండాలతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు, 'జై జగన్‌' అంటూ నినాదాలు చేశారు. కేక్‌ కట్‌ చేస్తూ, వైఎస్ జగన్‌ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు కూడా పాల్గొని తమ అభిమాన నేతకు జేజేలు పలికారు. టొరంటోలో నివాసం ఉంటున్న వెంకటాపురం నాగభూషణ్‌ రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, హరి మున్నంగి, వీరారెడ్డి, మోహన్‌ రెడ్డి, కృష్ణ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Jagan
Canada
Toranto
Celebrations

More Telugu News