BJP: నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అను నేను... ప్రమాణస్వీకారం చేసిన మోదీ

  • మోదీతో ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి
  • రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ
  • భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తిన రాష్ట్రపతిభవన్
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి, ఎన్డీయే కూటమికి బ్రహ్మాండమైన విజయం సాధించిపెట్టిన నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిగా మోదీతో ప్రమాణం చదివించారు. నరేంద్ర దామోదర్ దాస్ అను నేను అంటూ మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ ప్రమాణ పత్రం చదువుతున్న సమయంలో బోలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు మార్మోగిపోయాయి. మోదీ అనంతరం కేంద్రమంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆపై అమిత్ షాను రాష్ట్రపతి ఆహ్వానించారు. అమిత్ షా కేంద్ర క్యాబినెట్ లో అడుగుపెట్టడం ఇదే ప్రథమం. కాగా, మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి బిమ్ స్టెక్ దేశాధినేతలతో పాటు దేశంలోని వివిధ రంగాలకు చెందిని ప్రముఖులు హాజరయ్యారు.
BJP
Narendra Modi

More Telugu News