Dhun badal ke dekho: అవమానించొద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్న విద్యాబాలన్.. వైరల్ అవుతున్న వీడియో!

  • శరీరాకృతి వల్ల అవమానాలపాలవుతున్న నటీమణులు
  • అవమానాలను ఎదుర్కొన్న వారిలో విద్య ఒకరు
  • బిగ్ ఎఫ్‌ఎంతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న విద్య
శరీరాకృతి కారణంగా సాధారణ మహిళలే కాదు, ప్రముఖ నటీమణులు కూడా వేధింపులకు గురవుతున్నారు. ఇలా అవమానాలను ఎదుర్కొన్న వారిలో విద్యాబాలన్ ఒకరు. అలా అవమానాలు సహిస్తూ వస్తున్నవారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆమె ప్రముఖ రేడియో స్టేషన్ బిగ్ ఎఫ్‌ఎంతో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమం పేరే ‘ధున్‌ బదల్‌ కే దేఖో’. ఈ కార్యక్రమం ద్వారా యువతీయువకులు బాడీ షేమింగ్ కారణంగా తాము ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమం కోసం విద్యతో బిగ్ ఎఫ్ఎం ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో శరీరాకృతిని, రూపును చూసి వెక్కిరించొద్దని పాట పాడుతూ విద్య కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.  
Dhun badal ke dekho
Vidya Balan
Big FM
Social Media
Video

More Telugu News